- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రేటర్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ఫలితంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు వైరస్ భయంతో బిక్కచచ్చిపోతున్నారు. ఏ రోజుకు ఆ రోజు నిన్ననే నయం అనేలా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతుండటం ప్రజలతో పాటు అధికారులను సైతం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలో నమోదవుతున్న కేసులు అమెరికాలోని కేసుల సంఖ్యను దాటేయగా తెలంగాణ రాష్ట్రంలో కేసులు మహారాష్ట్ర, ఢిల్లీలను దాటేలా కనబడుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో గత వారం రోజులుగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. వీటితో పాటే మరణాల సంఖ్య కూడా పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య జీవనం సాగిస్తున్నారు. గత నాలుగు రోజులుగా హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు నమోదవుతున్న కేసులు వెయ్యి దాటి ఉండడం, మరణాలు సైతం పెరగడం ప్రతి ఒక్కరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
లక్షణాలే లేకుండా పాజిటివ్…
గ్రేటర్ హైదరాబాద్ లో ఎలాంటి లక్షణాలు లేని వారిలో కూడా కరోనా పాజిటివ్ గా తేలుతోంది. కరోనా ఫస్ట్ వేవ్ లో వైరస్ లక్షణాలు తెలియడంతో ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండేవారు. జలుబు, పొడి దగ్గు, కొద్దిగా జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, శ్వాస సమస్య, వాసన, రుచి తెలియకుండా పోవడం వంటి లక్షణాలు ఫస్ట్ వేవ్‌లో కనబడేవి. కానీ ప్రస్తుతం విస్తరిస్తున్న సెకండ్ వేవ్ లో కరోనా లక్షణాలు భిన్నంగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా సెకండ్ వేవ్‌లో కరోనా సోకిన వారిలో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. వైరస్ సోకిన వారిలో జీర్ణాశయ సమస్యలు, పొత్తి కడుపులో నొప్పి, కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు, నీరసం, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి లక్షణాలు ఉన్న వారు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
అన్నింటి్కీ క్యూ లైన్లే…
కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలు ఆందోళనతో టెస్టుల కోసం పరుగులు తీస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద రద్ధీగా కనబడుతున్నాయి. ఓ వైపు వ్యాక్సిన్ కోసం వచ్చిన వారు, మరో వైపు పరీక్షల కోసం వచ్చిన వారితో ఆస్పత్రుల వద్ద గందరగోళ పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటీవల వరకు వ్యాక్సిన్ పై అంతగా నమ్మకం లేని వారు సైతం వేయించుకునేందుకు పరుగులు పెడుతున్నారు. మే 1వ తేదీ నుండి 18 ఏళ్ళు పై బడిన వారు కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడే ఇంతగా లైన్ లు ఉంటే యువకులు కూడా మొదలైతే ఎలా ఉంటుంది, క్యూ లైన్లు ఊహించలేమంటూ మధ్య వయస్సు వారంతా వ్యాక్సిన్ కోసం పరుగులు పెడుతున్నారు.
రెండు వేలకు చేరువలో మృతులు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేలకు చేరువలో కరోనా బారిన పడి మృతి చెందారు. శనివారం ఒక్క రోజే 8126 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు కాగా 38 మంది మత్యువాత పడ్డారు. ప్రస్థుతం అధికారిక లెక్కల ప్రకారమే 1999 మరణాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షణాలు లేకుండా కోవిడ్ బారిన పడిన వారు 79.5 శాతం ఉండగా 20.5 శాతం మందిలో లక్షణాలు కనబడుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో శనివారం రికార్డు స్థాయిలో 1259 కేసులు నమోదయ్యాయి.
వారం రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల వివరాలు..
తేదీ నమోదైన కేసులు
18.04.2021 705
19.04.2021 793
20.04.2021 898
21.04.2021 989
22.04.2021 1005
23.04.2021 1464
24.04.2021 1259