- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి: ఎర్రబెల్లి
by Shyam |
X
దిశ ప్రతినిధి, వరంగల్: కరోనా నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా కేసులు అధికం అవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో హైమాస్ లైట్లను ప్రారంభించిన మంత్రి బస్టాండ్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం వరంగల్ రూరల్ జిల్లా మైలారం సబ్ స్టేషన్ నుంచి జయరాం తండా వరకు ఏర్పాటు చేసిన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా స్వీయ నియంత్రణతో, సామాజిక, భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలన్నారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం అందిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్ట్, ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసి ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story