- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయ్
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. వారం రోజుల పాటు అర్ధ సెంచరీకి దిగువన నమోదై కాస్త శాంతించిన కరోనా వైరస్ మరోసారి కోరలు చాస్తోంది. ఏపీలో ఒక్క రోజులోనే 70 కేసులు నమోదు కావడం వైద్య ఆరోగ్య శాఖలో కలకలం రేపుతోంది. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల మూడు వేలకి చేరువలో నమోదవుతున్నాయి. కరోనా జోరు ఇలాగే కొనసాగిస్తే రేపటికి మూడు వేల మార్కు దాటిపోతుంది.
సోమవారం నుంచి దేవాలయాలు కూడా తెరుచుకోనున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో భారీ ఎత్తున పాజిటివ్ కేసులు బయటపడడం రాష్ట్రాన్ని ఆందోళనలోకి నెడుతోంది. ఏపీలో గడచిన 24 గంటల్లో 70 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,944కి చేరింది. కొత్త కేసుల్లో మూడింటికి కోయంబేడు లింకు ఉన్నట్టు గుర్తించారు. ఇవాళ 55 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 2,092కి పెరిగింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 792 మంది చికిత్స పొందుతున్నారు. ఇక గడచిన 24 గంటల్లో కరోనా మరణాలేవీ సంభవించలేదు.
ఇదిలా ఉండగా, విదేశాల నుంచి వచ్చిన వారిలో 111 మందికి కరోనా సోకినట్టు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి నిర్వహించిన పరీక్షల్లో 406 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని అధికారులు వెల్లడించారు. ఈ 406లో ప్రస్తుతం 217 యాక్టివ్ కేసులు ఉన్నట్టు, మిగిలిన వారు కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు అధికారులు తెలిపారు.