ఏపీలో 8 మంది మృతి

by srinivas |
ఏపీలో 8 మంది మృతి
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. గడిచిన 24 గంటల్లో 837 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో 789 మంది ఏపీ వాసులు ఉంటే.. విదేశాలకు చెదిన ఇద్దరికి, వివిధ రాష్ట్రాలకు చెందిన 46 మందికి కరోనా సోకినట్టు వెల్లడించింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు 14,414 మంది కరోనా వైరస్ బారిన పడగా, విదేశాలు (409), వివిధ రాష్ట్రాల (2111)కు చెందిన వారితో కలిసి మొత్తం 16,934 మందికి కరోనా సోకిందని వెల్లడించింది. గడచిన 24 గంటల్లో వివిధ ఆస్పత్రుల్లో చేరి కరోనా బారి నుంచి కోలుకుని 258 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏపీలో కరోనాకి 9096 చికిత్స పొందుతుండగా, 7,632 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కారణంగా నిన్న ఎనిమిది మంది మృతి చెందడంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య మొత్తం 206కి చేరిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed