- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిగ్ బ్రేకింగ్ : కరోనా మృతదేహం తారుమారు..
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కోవిడ్ తో చికిత్స పొందుతూ ఇద్ధరు వృద్ధ మహిళలు మృతి చెందారు. ఆ మృతదేహాలను వారి బంధువులకు అప్పగించే విషయంలో ఆసుపత్రి సిబ్బందితో నిర్లక్ష్యం వహించడంతో వివాదం చెలరేగింది. నగరంలోని హైమద్ పురకు చెందిన 70 సంవత్సరాల వృద్ధురాలు, గాయత్రి నగర్ కు చెందిన 65 వృద్ధురాలు చికిత్స పొందుతూ మరణించారు. అయితే బంధువులకు అప్పగించే విషయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మృతదేహలు తారుమారయ్యాయి. విషయం తెలియక గాయత్రి నగర్ కు చెందిన వారు తమ తాలుకు మృతదేహంగా భావించి వారి సంప్రాదాయాలను అనుసరించి స్థానిక స్మశాన వాటికలో దహనం చేశారు.
కాని అ మృతదేహం హైమద్ పురకు చెందిన వేరే సామాజిక వర్గానికి సంబంధించినది కావడంతో, తరువాత వచ్చినవారు గుర్తించి అందోళనకు దిగారు. అప్పటికే వారి తాలుకు మహిళ మృతదేహంకు అంత్యక్రియలు జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బందికి హైమద్ పురకు చెందిన వారికి మధ్య వాగ్వాదం జరిగింది. అలస్యంగా జరిగిన తప్పును గుర్తించిన ఆసుపత్రి వర్గాలు కరోనాతో చనిపోయిన వారి మృతదేహలు ఇవ్వడం కుదరదని అధికారికంగా తామే అంత్యక్రియలు చేస్తామని బుకాయించి సముదాయించే ప్రయత్నం చేశారు. జిల్లాలో కరోనా కేసులు సంఖ్య వందల్లో ఉండటం, నిత్యం పదుల సంఖ్యలో మరణాలు ఉండటంతో వారు చేసేదేమిలేక వెళ్లిపోయారు. ఈ విషయంపై జిల్లా ఆసుపత్రి సూపరింటేండేంట్ డాక్టర్ ప్రతిమా రాజ్ ను వివరణ కోరేందుకు యత్నించగా ఆమె ఫోన్ అందుబాటులో లేకుండా పోయింది.