- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా వల్ల లాభపడుతున్న సినిమా
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. లాక్‌డౌన్‌లు, క్వారంటైన్లు, ఐసోలేషన్లు అంటూ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ గత రెండు నెలలుగా ఒక హాలీవుడ్ సినిమా మాత్రం విపరీతంగా లాభపడుతోంది. 2011లో విడుదల కాంటెజియన్ అనే సినిమా కథ దాదాపు ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితినే కలిగి ఉంటుంది. దీంతో కరోనా వైరస్ గురించి ఈ సినిమా ముందే భవిష్యవాణి చెప్పిందంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇంట్లోనే ఖాళీగా కూర్చున్న వాళ్లందరూ ఈ సినిమా రెండు మూడు సార్లు రిపీట్ చేసి మరీ చూస్తున్నారు.
స్టీవ్ సోడర్‌బెర్గ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత రెండు నెలలుగా పాపులర్ ఆఫ్ దిస్ వీక్ కేటగిరీలో నిలుస్తోంది. ఈ సినిమాలో హాంగ్ కాంగ్ నుంచి వచ్చిన గుర్తుతెలియని ఒక వైరస్ కారణంగా అమెరికా మొత్తం లాక్‌డౌన్ పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వాలు, డాక్టర్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కలిసి ఎలా కట్టడి చేసేయనేదే కథాంశం. అలాగే పాండమిక్ సమయంలో పత్రికలు, విలేకరులు, మెడికల్ హవాలాల పనితీరును కూడా ఈ సినిమాలో చూపించారు. దీంతో దాదాపుగా కరోనా వైరస్ పరిస్థితులనే అద్దంపట్టిన అనుభూతి కలుగుతుంది. సినిమా చూస్తుంటే దర్శకుడు నిజంగానే భవిష్యత్తులోకి వెళ్లి వచ్చి సినిమా కథ అల్లుకున్నాడేమో అనిపిస్తుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ట్రెండింగ్‌లో ఉంది. దీంతో పాటు వైరస్ అనే మలయాళ సినిమా కూడా భారతదేశంలో బాగా పాపులర్ అవుతోంది.