- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కలకలం.. ఒక్కరోజులోనే 60 వేల కేసులు
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి అంతకంతకు పెరుగుతుంది. వారం రోజుల్లోనే దేశంలో ఆక్టివ్ కేసుల సంఖ్య లక్ష పెరగడంతో ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా భయాందోళనలకు గురి అవుతుంది. గతంతో పోలిస్తే పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో కలవరానికి గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 11,00,756 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..59,118 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.గతేడాది అక్టోబర్ తర్వాత ఇంత మొత్తంలో కేసులు నమోదు కావడం మొదటిసారి అని వైద్య అధికారులు తెలుపుతున్నారు.
తాజాగా దేశ వ్యాప్తంగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,18,46,652కు పెరగ్గా.. మరణాల సంఖ్య 1,60,949కు చేరింది. కొత్తగా 32,987 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,12,64,637 మంది కోలుకున్నారు. ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 95.09 శాతానికి పడిపోగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 3.55 శాతానికి పెరిగాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.36% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.