- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మళ్ళీ 30 వేలు దాటిన యాక్టివ్ కేసులు
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మళ్ళీ యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య 30వేలు దాటింది. గత నాలుగైదు రోజులుగా అదుపులోనే ఉన్న కొత్త కేసులు డిశ్చార్జి సంఖ్య కంటే పెరగడంతో యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 1.79 లక్షల పాజిటివ్ కేసులు నమోదుకాగా అందులో 1.48 లక్షలు రికవర్ అయ్యాయి. ఇంకా 30,037 యాక్టివ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇందులో సుమారు 24 వేలు ప్రభుత్వ, హోమ్ ఐసొలేషన్‌లో ఉండగా మిగిలిన పాజిటివ్ పేషెంట్లు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ బులెటిన్ ప్రకారం తాజాగా 8మంది చనిపోవడంతో కరోనా మృతుల సంఖ్య 1070కు పెరిగింది.
హైదరాబాద్ నగరంలో కొత్త కేసులు 300కు తగ్గడంలేదు. ఈ నెల మొదటివారానికే అదుపులోకి వస్తుందని చెప్పినా నెల చివరకు వచ్చినా అదే తీవ్రత కొనసాగుతూ ఉంది. తాజాగా 308 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి, మల్కాజిగిరి, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, సిద్దిపేట, సూర్యాపేట, నిజామామాద్, కామారెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లాల్లో వైరస్ కేసులు ఎక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయి.