- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో కరోనా @64,713.. ఒక్కరోజే 65మంది మృతి
దిశ, ఏపీబ్యూరో :
ఏపీ ప్రజలను కరోనా వైరస్ రోజురోజుకూ భయబ్రాంతులకు గురిచేస్తోంది. తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో అయితే వైరస్ తన పంజా విసురుతోంది.ఇప్పటికే పలువురు అధికారులు, పోలీసులు, ఆరోగ్య సిబ్బంది దీని బారినపడి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు కూడా ఈ జిల్లాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 6,045 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. విశాఖపట్టణం జిల్లాలో రికార్డు స్థాయిలో 1049 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైజాగ్ పట్టణం నలుమూలల నుంచి కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే వైజాగ్‌లో పాజిటివ్ కేసులు భారీ ఎత్తున నమోదవుతుండటంతో పలు ఆంక్షలు అమలవుతున్నాయి. మంగళవారం ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు పలువురు అధికార పార్టీ నేతలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, తామంతా హోం క్వారంటైన్‌లో ఉన్నాంటూ తెలిపారు. తాజాగా వారి కుటుంబ సభ్యులు ప్రైమ్, సెకెండరీ కాంటాక్టులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో బయటపడ్డాయి.
ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులు..
తూర్పు గోదావరి (891), గుంటూరు (842), కర్నూలు (678) జిల్లాలు ఎప్పటిలాగే పాజిటివ్ కేసుల్లో టాప్‌లోనే కొనసాగుతున్నాయి. ఇక అనంతపురం (325), చిత్తూరు (345), నెల్లూరు (327), శ్రీకాకుళం (252), కడప (229), ప్రకాశం (177), కృష్ణా (151), విజయనగరం (107) జిల్లాల్లో కరోనా తన ప్రతాపం చూపుతోంది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు 64,713 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో 31,763 మంది కరోనా పాజిటివ్ సోకిన వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, మరో 32,127 మంది వివిధ ఆస్పత్రుల్లో కరోనాకి చికిత్స పొంది, కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్కరోజే గుంటూరు జిల్లాలో 15 మంది మృత్యువాతపడ్డారు. కృష్ణాలో 10మంది, పశ్చిమగోదావరిలో 8 మంది, తూర్పుగోదావరిలో 7గురు, చిత్తూరు, కర్నూలుల్లో 5గురు చొప్పున, విజయనగరంలో నలుగురు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనా బారినపడి 823 మంది చనిపోయారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.