భోగి మంటల్లో సాగు చట్టాల ప్రతులు

by Shamantha N |
భోగి మంటల్లో సాగు చట్టాల ప్రతులు
X

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాల ప్రతులను రైతులు భోగి మంటల్లో వేసి దహనం చేశారు. వసంత కాలం ప్రారంభాన్ని పురస్కరించుకుని పంజాబ్‌లో లోహ్రి పండుగ జరుపుకుంటారు. భోగి మంటల్లో బెల్లం, నువ్వులు, మొక్క జొన్న తదితర ఆహార పదార్థాలను వేస్తుంటారు. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఘాజీపూర్ సరిహద్దు వద్ద ఆందోళన చేస్తున్న రైతులు భోగి మంటల్లో చట్ట ప్రతులను వేసి దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు విరమించే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలను ప్రారంభించి బుధవారం నాటికి 50 రోజులు పూర్తికావడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed