- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు
X
దిశ, వెబ్‌డెస్క్: సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. శుద్ధి చేసిన పామాయిల్‌పై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ నిర్ణయం వర్తిస్తుందని నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చర్యతో దేశంలో వంట నూనె ధరలు భారీగా తగ్గనున్నాయి.
వంట నూనె ధరలు భారీగా పెరగడంతో సామాన్యుల జేబుకు చిల్లులు పడుతున్నాయి. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు పెరిగాయని, సామాన్యుడు బ్రతికేదెలా అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేకసార్లు వంటనూనెపై సుంకాన్ని తగ్గించగా.. ఇప్పుడు మరింత తగ్గించింది. తాజా నిర్ణయంతో సామాన్యులకు మరింత ఊరట కలగనుంది.
Advertisement
Next Story