- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రక్తపు చుక్కలతో ‘షూ’.. అమెరికన్ కంపెనీ నిర్వాకం
దిశ, ఫీచర్స్ : అమెరికాలోని ఆర్ట్ కలెక్టివ్ సంస్థ ఎంఎస్‌సీహెచ్ఎఫ్.. అమెరికన్ సింగర్ లిల్ నాస్ అసోసియేషన్‌తో 666 ‘సతాన్’ షూస్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్నీకర్ షూస్‌లో లేస్‌లకు వెండి పెంటాగ్రామ్ లాకెట్(అయిదు కోణాలు ఉన్న నక్షత్రం)ను జతచేసింది. షూ చివరి భాగంలో ‘LUKE 10:18’ (బైబిల్ పద్య సూచన)ముద్రించిన కంపెనీ.. షూ సైజు (ఉదా. 6/666 )తో పాటు తిరగబడిన శిలువ చిహ్నాలను ఉంచడంతో పాటు మనిషి రక్తపు చుక్కను దీని తయారీలో ఉపయోగించడం వివాదాస్పదమైంది. అయితే ‘నైకీ ఎయిర్ మాక్స్ 97’ మోడల్ షూకు కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ షూస్ డిజైన్ చేశారని ఆరోపిస్తూ, నైకీ సంస్థ దీనిపై కేసు వేసింది.
మార్కెట్లోకి విడుదల చేసిన ఒక్క నిమిషంలోనే సతాన్ షూస్ అమ్ముడైపోగా, 60 క్యూబిక్ సెంటీమీటర్ల ఎరుపు రంగు సిరా, ఆర్ట్ కలెక్టివ్ సభ్యులు దానం చేసిన ఒక చుక్క రక్తం ఇందులో ఉండటం విశేషం. అయితే నైకీ మాత్రం తమ ట్రేడ్ మార్కును ఎంఎస్‌సీహెచ్‌ఎఫ్ సంస్థ చోరీ చేసిందని ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా, ఈ షూస్‌ను నైకీ ఆమోదించిందనే తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకున్న నెటిజన్లు.. నైకీ ఉత్పత్తులను బహిష్కరించాలని కోరుతూ ఇప్పటికే పిలుపునిస్తున్నారు. ఈ వివాదాస్పద షూ డిజైన్ గురించి కొంత మంది మత చాందసవాదులు, సంప్రదాయవాదులు ట్విట్టర్‌లో ఎంఎస్‌సీహెచ్‌ఎఫ్‌తో పాటు లిల్ నాస్ సంస్థను కూడా విమర్శించారు. దీంతో ‘బ్యాన్ లిన్ నాస్, నైకీ, ఎంఎస్‌సీహెచ్ఎఫ్’ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ‘క్రైస్తవులైన మనం పవిత్ర స్వరంతో, ఆత్మతో పోరాడటానికి సిద్ధంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఇది మతవిశ్వాసాన్ని కించపరుస్తుందని, క్రైస్తవులు దీనికి వ్యతిరేకంగా పోరాడాలని నేను ప్రార్థిస్తున్నాను’ అని పాస్టర్ మార్క్ బర్న్స్ ట్వీట్ చేశారు.
‘మాకు లిల్ నాస్ ఎక్స్ లేదా ఎంఎస్‌సీహెచ్‌ఎఫ్‌తో సంబంధం లేదు. నైకీ ఆమోదం లేదా అధికారం లేకుండా సతాన్ షూస్ ఉత్పత్తి చేశారు. నైకీ ఈ ప్రాజెక్టుతో ఏ విధంగానూ కనెక్ట్ కాలేదు. ఎంఎస్‌సీహెచ్ఎఫ్ సంస్థ ఈ షూ అమ్మకాలను నిలిపివేయడంతో పాటు తమ స్వుష్ డిజైన్ మార్కును వాడకుండా ఆదేశించాలని కోర్టును కోరాం. ఆ సంస్థకు మాతో సంబంధం ఉందని ప్రజలు భావిస్తుండటం తమ సంస్థపై చెడు అభిప్రాయాన్ని కలగజేస్తుంది’ అని నైకీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ఎంఎస్‌సీహెచ్ఎఫ్ గతంలోనూ ‘నైకీ ఎయిర్ మాక్స్ 97’ షూ మోడల్ కాపీ చేస్తూ, ‘జీసస్ షూస్’ విడుదల చేసింది, దీనిలో జోర్డాన్ నది నుంచి తీసిన పవిత్ర జలాన్ని వాడింది.