- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాటారంలో గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్
దిశ, కాటారం: కాటారంలో ఒకే రోజు గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ చోటుచేసుకుంది. గుడ్ న్యూస్ ఎంటంటే.. కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నూరు ప్రాంతానికి చేరుకోవాలంటే 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి కాటారం ప్రజలది. ఈ రెండు ప్రాంతాలకు మధ్య ఉన్న గోదావరిపై వంతెన లేకపోవడంతో ఎన్నో ఎండ్లుగా వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మీదుగా గోదావరి నది ప్రవహిస్తోంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి గోసను పట్టించునే నాధుడే కరువయ్యాడు. గోదావరి నదిపై వంతెన లేకపోవడంతో ఇరు ప్రాంతాలకు రాకపోకలు సాధ్యమయ్యేవి కాదు.
చెన్నూరుకు వెళ్లాంటే ఆ ప్రాంతవాసులు మంథని, గోదావరిఖని, ఇందారం క్రాసింగ్ మీదుగా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చేది. అయితే ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. ఇందులో భాగంగా నిర్మించిన అన్నారం బ్యారేజ్ మీదుగా వాహనాల రాకపోకలకు అనువుగా దారి నిర్మించారు. దీంతో కాటారం నుంచి చెన్నూరుకు ఇప్పుడు దూరం తగ్గిపోయింది. అంతేకాకుండా శనివారం అధికారులు ఇరు ప్రాంత వాసుల ప్రయోజనం కోసం కొత్తగా ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేయగా, భూపాలపల్లి జెడ్పీ ఛైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి చేతులమీదుగా ప్రారంభించారు. అన్నారం బ్యారేజ్ పై రహదారి ఏర్పాటు చేయడం వలన దాదాపు 70 కిలోమీటర్ల దూరం కలిసి వచ్చింది. దశాబ్దాలు కల నేరవేరడంతో కాటారం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బ్యాడ్ న్యూస్ ఎంటంటే..
కొత్తగా ప్రారంభించిన ట్రయల్ రన్ బస్సులో ప్రయాణిస్తున్న చెన్నూరు కంట్రోలర్ ఎల్లారెడ్డి కాళేశ్వరం చేరుకున్న తర్వాత గుండెపోటుతో మరణించాడు. కంట్రోలర్ ఆకస్మిక మరణం ప్రయాణీకులను, ఆర్టీసీ యంత్రాంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.