- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్ లక్షణాలున్నవారిని..పట్టుకునేందుకు ఆ షాపులపై నిఘా..
దిశ, మెదక్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్-19) మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. అయినా కేసులు తగ్గడం లేదు. అయితే, కొందరు కరోనా లక్షణాలున్నప్పటికీ పరీక్షలు, వైద్యం చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. దాంతో అటువంటి వారిని గుర్తించడంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో వైద్య అధికారులు మెడికల్ షాపులపై నిఘా పెట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మెడికల్ దుకాణాల్లో మందుల విక్రయాలపై నజర్ పెట్టారు. ఎవరైనా అనుమానిత లక్షణాలతో మందులు కొనుగోలు చేస్తే వారి పూర్తి వివరాలను నమోదు చేసి వైద్య అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. ఇలా కరోనా వైరస్ కట్టడికి అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
రోజువారీ సమాచార సేకరణ..
ఇప్పటికే లాక్ డౌన్ విధించి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను మూసేశారు. అత్యవసరమైతే తప్ప ఓపీ సేవలను పూర్తిగా నిలిపివేశారు. అయితే, అనారోగ్యం బారిన పడిన వారిని గుర్తించేందుకు మెడికల్ షాపులపై అధికారులు ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. ఇప్పటికే షాపు యజమానులకు అవగాహన కల్పించి
మందు గోలీల కోసం వచ్చే వారి వివరాలను నమోదు చేయాలని చెప్పారు. అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని వైద్యులకు ఇవ్వాలని ఆదేశిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మండలాల వారీగా ఉన్న మెడికల్ షాపుల ద్వారా రోజువారీ సమాచారాన్ని సేకరిస్తూ వైరస్ వ్యాప్తిని అంచనా వేస్తున్నారు. ప్రతి మెడికల్ షాపు వద్ద సీసీ కెమెరాలు పెట్టారు. షాపునకు వచ్చేవారు ప్రతిఒక్కరూ ఫిజికల్ డిస్టెన్స్(భౌతిక దూరం) పాటించేలా చూడాలని చెబుతున్నారు. కస్టమర్లలో ముఖ్యంగా పారాసిటమల్, జలుబు, దగ్గు సంబంధిత మందుల కోసం వచ్చిన వారి వివరాలను సేకరిస్తున్నారు. వారి పేరు, చిరునామా, సెల్ నెంబర్‌ను నమోదు చేసుకున్న తర్వాతనే మందులు విక్రయించాలని యజమానులకు చెబుతున్నారు. మరీ అనుమానం వస్తే
వైద్యులకు వెంటనే సమాచారం అందించాలని కోరుతున్నారు.
ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే మందులు..
గ్రామాల్లో వైద్యం చేస్తున్న ఆర్‌ఎంపీలకూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కరోనా పరిస్థితులు పూర్తిగా సద్దుమణిగేంత వరకు ఎలాంటి వైద్యం చేయరాదని చెబుతున్నారు. ఏదైనా అనుమానం వస్తే ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులను పంపాలని సూచిస్తున్నారు. వైద్యులు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే మెడికల్ షాపుల యజమానులు మందులు అందజేయాలి. రోగి ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నాడనే విషయాన్ని వైద్యులు తప్పనిసరిగా ప్రిస్క్రిప్షన్‌లో పేర్కొనాల్సి ఉంటుంది. అయితే, కొందరు కరోనా భయంతో వైద్యుల వద్దకు వెళ్లకుండా నేరుగా మెడికల్ షాపులోనే మందులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. దీంతో మెడికల్ షాపు యజమాని ఇచ్చే పరోక్ష సమాచారంతో రోగులను గుర్తించేలా అవగాహన కల్పిస్తున్నారు.
సమాచారం ఇవ్వాల్సిందే..
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారు మెడికల్ షాపుల్లో మందుల కోసం వస్తే వారి పేర్లను రిజిస్టర్‌లో రాసి సంబంధిత వైద్యాధికారులకు తెలియజేయాలి. ఈ సమాచారం తెలపడం వల్ల కరోనా వైరస్ ప్రబలకుండా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ వెంకటేశ్వరరావు, డీఎంహెచ్‌వో మెదక్.
Tags: covid 19 prevention, surveillance, on medical shops, DMHO, precautions, lock down