- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'కంటెజియన్' చిత్రాన్ని నిలబెట్టిన కరోనా
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ సినీ ఇండస్ట్రీని కుప్ప కూల్చిన కరోనా ఒక్క సినిమాను మాత్రం నిలబెట్టింది. 2011లో రిలీజైన సినిమాకు ఎక్కడలేని క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. టాప్ 100 జాబితాలో కూడా లేని చిత్రాన్ని టాప్‌లో నిలబెట్టింది. ఇదేమి విచిత్రం.. అదేమి చిత్రం అనేగా అనుమానం. మెడికల్ థ్రిల్లర్‌గా 2011 సెప్టెంబర్‌లో విడుదల అయింది ‘కంటెజియన్’ చిత్రం. ఈ సినిమా కథ కరోనా వైరస్‌కు దగ్గర పోలికలు ఉండడంతో ఒక్కసారిగా డౌన్‌లోడ్లు పెరిగాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు సినిమాను డౌన్ లోడ్ చేసుకుని చూసేవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వచ్చిందట. దీంతో టాప్ 100 జాబితాలో కూడా లేని సినిమా ఏకంగా ఆస్ట్రేలియా ఐట్యూన్స్ టాప్ 10 జాబితాలో చోటు సంపాదించింది. అమెరికాలో టాప్ 20 సినిమాల్లో ప్లేస్ దక్కించుకుంది. మొత్తానికి ప్రపంచానికి నష్టం కలిగిస్తున్న కరోనా వల్ల ఏదైనా లాభం ఉందీ అంటే.. ‘కంటెజియన్’ చిత్రానికి మాత్రమే. స్టీవెన్ సోడర్ బర్గ్ డైరెక్షన్‌లో వచ్చిన కంటెజియన్ చిత్రంలో మాట్ డామన్, లారెన్స్ ఫిష్ బర్న్ కీలకపాత్రల్లో కనిపించారు.
Tags: Contagion, CoronaVirus, Covid19, Medical Thriller