పెరుగుతున్న క్రెడిట్ కార్డుల వినియోగం

by Harish |
పెరుగుతున్న క్రెడిట్ కార్డుల వినియోగం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల వినియోగదారులు నగదు నుంచి తిరిగి క్రెడిట్ కార్డుల వినియోగానికి ఆసక్తి చూపిస్తున్నారని ట్రాన్స్ యూనియన్ సిబిల్ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా చొవిడ్-19 సంబంధిత లాక్‌డౌన్ కారణంగా నగదు లావాదేవీలు సురక్షితమని భావించిన వారు సాధారణ పరిస్థితులకు మారుతున్నారని నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం.. 2020 అక్టోబర్‌లో క్రెడిట్ కార్డు గురించిన ఎంక్వైరీలు గతేడాది అక్టోబర్ స్థాయిలో 106 శాతంగా నమోదయ్యాయి.

కొవిడ్-19 లాక్‌డౌన్ ఆంక్షలు సడలించినప్పటి నుంచ్ని వినియోగదారుల ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడ్డాయని నివేదిక అభిప్రాయపడింది. సాధారణంగా నగదు ఆధారంగా జరిగే మెట్రోయేతర ప్రాంతాల్లో ఈ మధ్య క్రెడిట్ కార్డుకు ఆదరణ పెరిగిందని క్రెడిట్ బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కువమంది వినియోగదారులు కార్డుల ద్వారానే లావాదేవీలను చేయాలనుకుంటున్నారు. ఆశ్చర్యంగా మెట్రో ప్రాంతాల్లో క్రెడిట్ నుంచి నగదు లావాదేవీలకు ఆసక్తి చూపిస్తుంటే, మెట్రోయేతర ప్రాంతాల్లో క్రెడిట్ కార్డులకు ఆదరణ పెరిగింది.

మెట్రోయేతర ప్రాంతాల్లో ఈ ఏడాది అక్టోబర్‌లో వార్షిక ప్రాతిపదికన 23 శాతం పెరగ్గా, మెట్రో నగరాల్లో 10 శాతం క్షీణించాయి. డిజిటల్ రూపంలో చెల్లింపులతో పాటు పండుగ సీజన్ వల్ల కార్డు లావాదేవీల వృద్ధికి కారణమని, భవిష్యత్తులో మరింత వృద్ధి నమోదయ్యే అవకాశాలున్నాయని ట్రాన్స్ యూనియన్ సిబిల్ వైస్ ప్రెసిడెంట్ అభయ్ కెల్కర్ వెల్లడించారు. వినియోగాదరుల్లో మార్పుకు మరో ఉదాహరణ.. క్రెడిట్ కార్డు బకాయిలు గతేడది 33 శాతం పెరగ్గా, ప్రస్తుత ఏడాది జులైలో 32 శాతానికి తగ్గిందని నివేదిక పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed