వినియోగదారుల ఖర్చులు తగ్గాయి : ఎస్‌బీఐ నివేదిక!

by Harish |
వినియోగదారుల ఖర్చులు తగ్గాయి : ఎస్‌బీఐ నివేదిక!
X

దిశ, సెంట్రల్ డెస్క్: ఏప్రిల్ నెలలో కార్డు లావాదేవీల వ్యయం తగ్గిందని, క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీల మొత్తం విలువ జనవరిలో రూ. 1.51 లక్షల కోట్ల నుంచి ఏప్రిల్‌లో రూ. 50 వేల కోట్లకు తగ్గాయని ఎస్‌బీఐ ఎకోరాప్ నివేదిక స్పష్టం చేసింది. క్రెడిట్ కార్డుల విషయంలో ఒక్కో కార్డు లావాదేవీ రూ. 12 వేల నుంచి రూ. 3,600కు, డెబిట్ కార్డుల విషయంలో రూ. 1000 నుంచి రూ. 350 కి తగ్గినట్టు ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. ‘వినియోగదారుల వ్యయం లగ్జరీ కొనుగోళ్ల నుంచి రోజువారి నిత్యావసరాలు, సరుకుల కొనుగోళ్లకు మారినట్టు’ నివేదిక వెల్లడించింది.

అయితే, వినియోగదారులు బంగారు రుణాలను తీసుకునేందుకు వినియోగిస్తున్నారని ఎస్‌బీఐ నివేదికలో తేలింది. ఏప్రిల్, మే నెలల్లో బంగారం ఈటీఎఫ్ పెట్టుబడులు రూ. 1,546 కోట్లుగా ఉన్నాయి. జనవరిలో బంగారం ఈటీఎఫ్ పెట్టుబడులు రూ. 202 కోట్లు పెరిగ్గా, ఫిబ్రవరిలో ఇది అధికంగా రూ. 1,483 కోట్లకు చేరినట్టు, అంతేకాకుండా అదనంగా సావరిన్ బాండ్‌ల రూపంలో బంగారం పెట్టుబడులు జూన్ త్రైమాసికంలో రూ. 3,107 కోట్లని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది.

Advertisement

Next Story