- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సినిమాలో పాట లేదని పది వేలు ఫైన్
దిశ, వెబ్‌డెస్క్: ట్రైలర్‌లో చూపించిన పాట, సినిమాలో లేని కారణంగా ఓ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థకు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కరణ కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ) పది వేల రూపాయల జరిమానా విధించింది. 2016లో విడుదలైన షారుక్ ఖాన్ ‘ఫ్యాన్’ సినిమా కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించకపోయినా అందులోని ‘జబ్ర ఫ్యాన్’ అనే పాట అందరి మనసులు దోచుకుంది. ముఖ్యంగా షారుక్ ఖాన్ డై హార్ట్ ఫ్యాన్స్‌కి ఈ పాట పిచ్చపిచ్చగా నచ్చేసింది. కానీ ట్రైలర్‌లో కనిపించిన ఈ పాట సినిమాలో లేకపోవడంతో నిరుత్సాహపడిన ఓ అభిమాని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసింది.
ఔరంగాబాద్‌కి చెందిన అఫ్రీన్ ఫాతిమా జైదీ ఈ పాట సినిమాలో లేకపోవడం గురించి ముందుగా జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఫిర్యాదును కొట్టివేయడంతో 2017లో మహారాష్ట్ర స్టేట్ కన్జ్యూమర్ కమిషన్ వద్దకు వెళ్లింది. దీన్ని విచారించిన కమిషన్, అఫ్రీన్‌కి రూ. 5000ల లిటిగేషన్ చార్జీతో కలిపి మొత్తం రూ. 10000 చెల్లించాలని యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థను ఆదేశించింది. ఇలా చేయడం సబబు కాదని, అభిమానులను నిరాశ పరచడం తప్పుగా పరిగణించినట్లు కమిషన్ తెలిపింది. అయితే ఈ పాట సినిమాలో ఉండదని పలు ఇంటర్వ్యూల్లో చిత్ర బృందం చెప్పారంటూ నిర్మాణ సంస్థ చేసిన వాదనను కమిషన్ కొట్టిపారేసింది.