- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంటి గుమ్మానికి అడ్డంగా ప్రహరీ గోడ నిర్మాణం.. ఇదేంటని అడిగితే..
దిశ,మునుగోడు : ఇంటి గుమ్మానికి అడ్డంగా ప్రభుత్వ భూమిలో ప్రహరీ నిర్మాణం చేపడుతున్నారంటూ చౌటుప్పల్‌కు చెందిన మార్గం లక్షమ్మ శనివారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రానికి చెందిన మార్గం లక్ష్మమ్మ పట్టణ కేంద్రంలోని భాస్కర్ థియేటర్ పక్కన గత 60 సంవత్సరాల క్రితం ఇంటిని నిర్మించుకుంది.
అయితే ఈ ఇంటి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో కొందరు ఆక్రమణదారులు ప్రహరీ నిర్మాణం చేపడుతున్నారని ఆమె ఆరోపించింది. బయటకు రావడానికి కనీసం దారైనా వదిలిపెట్టి నిర్మించుకోవాలని చెప్పినా.. ఇంటి నుండి బయటకు రాకుండా గుమ్మానికి ఎదురుగానే అక్రమంగా నిర్మిస్తున్నారని వాపోయింది. ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం ఆ భూమి విలువ సుమారు రెండు కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.గతంలో మున్సిపల్ చైర్మన్, కమిషనర్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. కలెక్టర్ స్పందించి తగిన న్యాయం చేయాలని కోరింది.