ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాల నిర్మాణం

by Shyam |
Cheers for India
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలోనే అత్యుత్తమ క్రీడాపాలసీని తెలంగాణలో రూపొందించనున్నట్లు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ మినీ స్టేడియంలో ఒలంపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన చీర్స్ ఫర్ ఇండియా కార్యక్రమంలో పాల్గొని ఒలంపిక్స్ జ్యోతిని హాకీ మాజీ ఆటగాడు, ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్ కుమార్ నుంచి అందుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు పెద్ద పీట వేసి ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో క్రీడా పాలసీని రూపొందించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని నియమించామని తెలిపారు. క్రీడల అభివృద్ధికి అన్ని నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామని, ఇప్పటికే 30 పైగా స్టేడియంల నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఒలంపిక్స్‌కు వెళ్తున్నా 115 మంది ఆటగాళ్లకు మంత్రి చీర్స్ చెప్పారు.

కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే అల వెంకటేశ్వర రెడ్డి, స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, ఒలంపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఇన్ చార్జి అధ్యక్షుడు సముద్రాల వేణుగోపాలచారి, ఉపాధ్యక్షుడు ప్రేమ్ రాజ్, కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్, కార్పొరేటర్ శంకర్ యాదవ్, ట్రిపుల్ ఒలంపియన్ ముఖేష్, ఎస్ఈటీఎస్ అధికారులు ధనలక్ష్మి, వెంకయ్య, మనోహర్ గౌడ్, నర్సయ్య, చంద్రారెడ్డి, కోచ్ లు, క్రీడాకారులు, క్రీడా అసోసియేషన్లకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story