నిరంతరంగా ప్రజా ఆశీర్వాద యాత్ర : కిషన్ రెడ్డి

by Shyam |
నిరంతరంగా ప్రజా ఆశీర్వాద యాత్ర : కిషన్ రెడ్డి
X

దిశ, అంబర్‌పేట్: ప్రజా ఆశీర్వాద యాత్ర నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 2023లో రాష్ట్రం, కేంద్రంలో అధికారమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణతో సైనికుడు వలె కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ అధ్యక్షతన ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నామని, ఇప్పటికే దాదాపు 58 కోట్ల మందికి ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు.

పూర్తిగా దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలో సమర్థవంతమైన నాయకత్వం గల నరేంద్ర మోడీలాంటి వ్యక్తి ఏ పార్టీ లేరని జోస్యం చెప్పారు. కరోనా లాంటి కష్ట సమయంలో దేశ ప్రజలందరిని ఐక్యం చేసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ అని కొనియాడారు. పార్టీ నేతలు నిత్యం కార్యకర్తలతో కలిసి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్ర రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీత మూర్తి, బీ వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు కన్నె ఉమా రమేష్ యాదవ్, పద్మ వెంకట్ రెడ్డి, అమృత, మహాలక్ష్మి, రామన్ గౌడ్, బండారి రాధిక, సూర్యప్రకాష్, నందకిషోర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story