డ్యూటీకి వెళ్లిన కానిస్టేబుల్.. అంతలోనే భార్య ఏం చేసిందంటే?

by Sumithra |
AR Constable Veerababu
X

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వీరాబాబు భార్య సోమవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఉదయం భర్త విధులకు వెళ్లిన కొద్దిసేపటికే భార్య సంధ్య(27) ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలిసుకున్న వీరబాబు వెంటనే ఇంటికొచ్చి, పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కానిస్టేబుల్ వీరబాబు నేతి విద్యాసాగర్ వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్నారు.

Advertisement

Next Story