తీవ్ర నష్టం జరుగుతోంది.. సీఎం కేసీఆర్‌కు కానిస్టేబుళ్ల విన్నపం

by Shyam |
తీవ్ర నష్టం జరుగుతోంది.. సీఎం కేసీఆర్‌కు కానిస్టేబుళ్ల విన్నపం
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: జిల్లాల నియామకంలో మాకు తీవ్ర న‌ష్టం జ‌రుగుతోంద‌ని, మాకు సత్వరం న్యాయం చేయాల‌ని కోరుతూ ఏఆర్ టు సివిల్ క‌న్వర్షన్ బ్యాచ్‌కు (1990, 1992 బ్యాచ్‌ల‌కు) చెందిన కానిస్టేబుళ్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వేడుకుంటున్నారు. ఈ మేర‌కు వ‌రంగ‌ల్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని కానిస్టేబుళ్లు గురువారం సీపీ త‌రుణ్ జోషి కార్యాల‌యంలో విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ మేర‌కు అనంత‌రం క‌న్వర్షన్ బ్యాచ్‌ల‌కు చెందిన కానిస్టేబుళ్లు ఒక ప్రకట‌న‌ను విడుద‌ల చేశారు.

కొత్త జిల్లాలో నియామకాలలో భాగంగా త‌మ‌కు 2015 బ్యాచ్ వారి కంటే త‌క్కువ సీనియారిటీగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నట్లుగా ఆవేద‌న వ్యక్తం చేశారు. ఈ ప‌రిణామంతో భ‌విష్యత్‌లో ఉద్యోగ ప‌ర‌మైన న‌ష్టాల‌తో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంశాల్లోనూ న‌ష్టపోవాల్సి వ‌స్తుంద‌ని ఆందోళ‌న వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ విష‌యంపై కోర్టులో విచార‌ణ కొన‌సాగుతోంద‌ని, పదోన్నతుల విష‌యంలో కోర్టు తీర్పున‌కు లోబడి ఉంటామ‌ని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం జిల్లాల నియామకంలో అన్యాయానికి గురికావాల్సి వ‌స్తోంద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త‌మ‌కు న్యాయం జ‌రిగేలా చూడాల‌ని, సీపీ ద్వారా విన్న వించుకున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed