చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి

by Shyam |   ( Updated:2020-04-13 07:50:58.0  )
చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి
X

దిశ, హైదరాబాద్: చాదర్‌ఘాట్ బ్రిడ్జి వద్ద రెండ్రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ రాజు సోమవారం మృతిచెందారు. సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న రాజు డ్యూటీ అయిపోయాక తెల్లవారుజామున 3 గంటలకు ఇంటికి వెళ్తుండగా కుక్కలు అడ్డురావడంతో బైక్‌పై నుంచి కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయమైన రాజును ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. 2010లో పోలీస్ ఉద్యోగంలో చేరిన రాజుకు 2017లోనే వివాహం అయ్యింది. ప్రస్తుతం ఆయన భార్య గర్భవతి. కానిస్టేబుల్ రాజు మృతిపట్ల పలువురు అధికారులు సంతాపాన్ని తెలిపారు.

tags: Constable Raju, Hyderabad, Sultan Bazar PS, Road Accident, Malakpet, Yashoda Hospital

Advertisement

Next Story

Most Viewed