- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలెక్టరేట్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య
దిశ, వెబ్‌డెస్క్: బాధితులకు న్యాయం చేస్తామని భరోసా కల్పించాల్సిన రక్షక భటుడే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏకంగా కలెక్టరేట్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం ఒంగోలు కలెక్టరేట్‌లో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… ఒంగోలు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మారుబోయిన వీరాంజనేయులు (53), కలెక్టర్ కార్యాలయంలోని కొవిడ్ సెల్‌లో విధులు నిర్వహించడానికి వెళ్లి, అక్కడే తనువు చాలించాడు.
ఈ విషయాన్ని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అల్తాఫ్ హుస్సేన్ వెల్లడించారు. కుటుంబ సమస్యల కారణంగా గత కొన్నేండ్లుగా వీరాంజనేయులు ఒత్తిడిలో కనిపిస్తున్నారని, ఆయన ఆరోగ్యం కూడా కొంతకాలంగా సరిగా ఉండటం లేదని తెలిపారు. దాంతో కరోనా వైరస్ సోకిందేమోనని ఆందోళన చెంది, కొవిడ్ సెల్‌లో విధులకు వెళ్లి అక్కడే ఓ గదిలో ఉరేసుకున్నాడని చెప్పారు.
ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.