- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆచితూచి ఖర్చు పెట్టండి.. ఆరోజు నుంచి బ్యాంకులకు వరుస సెలవులు
దిశ తెలంగాణ బ్యూరో: బ్యాంకు కష్టమర్లు డబ్బుల విషయంలో ఆచితూచి ఖర్చు పెట్టండి. లేకపోతే కష్టాలు తప్పవు. ఈ నెల 26 నుంచి 29 వరకు బ్యాంకులకు సెలవు. ఇక 30, 31 తేదీల్లో మాత్రమే పని చేయనున్నాయి. ఇక ఏప్రిల్‌లో బ్యాంకులు 18 రోజులే పని చేయనున్నాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సెలవుల క్యాలెండర్ ప్రకారం ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ నెలలో బ్యాంకులు 12 రోజులు మూసివేయబడతాయి. ఈ 12 రోజుల్లో ఆరు సాధారణ సెలవులు కాగా, మిగతా ఆరు సెలవుల్లో గుడ్ ఫ్రైడే, ఉగాది, శ్రీరామ నవమితో పాటు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఉన్నాయి. సెలవులకు అనుగుణంగా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవడం మంచిది.
మార్చిలో ఏ రోజు ఏంటంటే..
26 : భారత్ బంద్
27 : నాల్గవ శనివారం
28 : ఆదివారం
29 : హోలీ
30 : వర్కింగ్ డే
31 : ఆర్థిక సంవత్సరపు చివరిరోజు
ఏప్రిల్‌లో ఏ రోజు ఏంటంటే..
1: వార్షిక ఖాతాల మూసివేత
2: గుడ్ ఫ్రైడే
4: ఆదివారం
5: బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు
10: రెండవ శనివారం
11: ఆదివారం
13: ఉగాది పండుగ
14: డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి
18: ఆదివారం
21: శ్రీరామ నవమి
24: నాల్గవ శనివారం
25: ఆదివారం