అండగా ఉంటుంది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

by Aamani |
అండగా ఉంటుంది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
X

దిశ, ఆదిలాబాద్: ఇతర రాష్ట్రాలకు వెళ్లే వలస కూలీలు, శ్రామికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఛత్తీస్ గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన 350 మంది వలస కూలీలను శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు సొంత ఖర్చులతో 8 వాహనాలలో కూలీలను స్వగ్రామాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి పాల్వాయి హరీశ్ బాబు, జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్, డీసీసీ ఓబీసీ చైర్మన్ దాసరి వెంకటేశ్, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story