కక్షపూరితంగానే కాంగ్రెస్ మహిళ సర్పంచ్‌ను సస్పెండ్ చేశారు.. కాంగ్రెస్

by Shyam |   ( Updated:2021-12-20 06:07:01.0  )
sarpanch
X

దిశ, గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామ సర్పంచ్ బేకు నీలమ్మను ఈరోజు (సోమవారం) అధికారులు సస్పెండ్ చేశారు. దీనితో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఇది కక్షపూరితంగా చేసిన సస్పెండ్ అని వారు ఆరోపించారు. మండల టీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే సహకారంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇలా చేశారని మండిపడ్డారు. అన్ని గ్రామ పంచాయితీలో అక్రమాలు జరుగుతున్న పట్టించుకోని అధికారులు కేవలం గుమ్మడిదల మండలంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఒక్కరే ఉండటం వల్ల ఆమెను పక్కకు తప్పించడానికి అక్రమాలు, ఆరోపణలు చూపుతూ ఇలా చేశారని పేర్కొన్నారు. ఆమెపై ఒత్తిడి తెచ్చి టీఆర్‌ఎస్ పార్టీలోకి రప్పించు కోవాలని చూస్తున్నరన్నారు.

కాంగ్రెస్ పార్టీని చిన్నాభిన్నం చేయాలన్న ఆలోచనతో తెరాస పార్టీ పన్నాగం పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజాసేవలో ఉండే మహిళా సర్పంచ్ నీలమ్మను ఇబ్బందుల పాలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మద్ది వీరారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, దోమడుగు గ్రామ ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్, అన్నారం ఉపసర్పంచ్ మురళి, అన్నారం మాజీ సర్పంచ్ జై శంకర్, పుట్ట నర్సింగ్రావు ప్రతాప్ రెడ్డి, కావలి శంకర్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed