ఈనెల 18న కాంగ్రెస్ ‘స్పీకప్’ తెలంగాణ

by Shyam |
ఈనెల 18న కాంగ్రెస్ ‘స్పీకప్’ తెలంగాణ
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా పరిస్థితులపై ప్రభుత్వం తీసుకుంటున్న అంశాలు, ఆందోళనలను వినిపించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆన్‌లైన్ వేదికగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా స్పీకప్ తెలంగాణ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేయనున్నారు. ఈనెల 18న ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా రాష్ట్ర ప్రజలు తమ ఆందోళనను వినిపించవచ్చని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. కరోనా మహమ్మారి, ఆరోగ్యం, విద్యారంగ సమస్యలపై చర్చించేందుకు ఆన్‌లైన్ ద్వారా టీపీసీసీ కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సోమవారం సమావేశమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తమ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనాను నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. 13రోజులుగా సీఎం కేసీఆర్ అదృశ్యం కావడం దురదృష్టకరమన్నారు. ఈనెల 18న శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా స్పీకప్ తెలంగాణలో ప్రజలు అభిప్రాయాలను వెల్లడించాలని సూచించారు. అదేవిధంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి పరిశీలనలు, సూచనలు, సలహాలతో సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాస్తున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed