కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కన్నుమూత

by Shamantha N |   ( Updated:2020-12-21 05:06:15.0  )
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మోతిలాల్ ఓరా(93) తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో ఉన్న ఆయన ఇటీవల న్యూ ఢిల్లీలోని ఎస్కార్ట్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్న ఓరా ఆరోగ్యం మరింత క్షీణించింది. సోమవారం మధ్యాహ్నం కన్నుమూసినట్టు వైద్యులు ధృవీకరించారు.

రాజకీయ ప్రస్థానం:

పాత్రికేయరంగంలో చాలా కాలం పని చేసిన ఓరా 1968లో రాజకీయరంగ ప్రవేశం చేశారు. 1970లో మధ్యప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా గెలుపొంది.. ఆ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచిన ఓరా హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఆర్జున్ సింగ్ కేబినెట్‌లో విధులు నిర్వహించారు. 1983 కేబినెట్ మినిస్టర్‌గా ఉన్న ఓరా అదే సమయంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చైర్మన్‌గా కూడా ఉన్నారు.

తన రాజకీయ ప్రస్థానాన్ని నిలుపుకున్న మోతీలాల్ ఓరా 1985, ఫిబ్రవరి 13 మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 1988 ఫిబ్రవరి 13న సీఎం పదవికి రాజీనామా చేసి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నియామకం అయ్యారు. కాగా, 1989 ఎన్నికల విజయం తర్వాత కూడా సీఎంగా ఎన్నికైనా ఆయన అదే సంవత్సరంలో రాజీనామా చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 1988లోనే రాజ్యసభకు ఎంపికయ్యారు. అనంతరం 1993వ సంవత్సరం మే 26న ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌‌గా ఎంపికైనా ఆయన.. 1996, మే 3 వరకు సేవలందించారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో..

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ ఆస్తి వివాదంలో మోతీలాల్‌ పై ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కేసు కోర్టులో ఇంకా విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు తీర్పు వెలువడలేదు. అయితే, జర్నల్స్ లిమిటెట్, యంగ్ ఇండియన్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ఓరా కీలక పాత్ర పోషించారు. దీనికి తోడు 22 మార్చి 2002లో జర్నల్స్ లిమిటెడ్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

Advertisement

Next Story