- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హస్తినాలో ‘హ్యాండ్’కు బ్యాండ్
హస్తినాలో హ్యాండ్‌కు బ్యాండ్ పడింది. దేశ రాజధాని ఢిల్లీలో ముచ్చటగా మూడోసారి సామాన్యుడికే ప్రజలు పట్టం కట్టారు. 2013లో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారాన్ని లాగేసుకున్న కేజ్రీవాల్.. ఇప్పటివరకు జాతీయ పార్టీలకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుండుసున్న, బీజేపీకి మూడు సీట్లు ఇచ్చి వన్‌మ్యాన్ షో నడిపిన కేజ్రీవాల్.. ఇప్పుడు కూడా బీజేపీ, కాంగ్రెస్‌లను దరి దాపుల్లోకి రానివ్వకుండా బంపర్ హిట్ కొట్టారు. గతంలో దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీకి రెండు దఫాలుగా గెలుపు రుచి కూడా చూపించకుండా ఊడ్చిపారేశారు. ఈ క్రమంలోనే ఎత్తులు, పై ఎత్తులతో దూసుకొచ్చిన బీజేపీకి సైతం చుక్కలు చూపించి తీన్మార్ కొట్టి కుర్చీని కాపాడుకున్నాడు.
2013 వరకు వరుసగా మూడుసార్లు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం దిక్కతోచని పరిస్థితి వచ్చింది. ఢిల్లీకి సీఎంగా పనిచేసి బలమైన నాయకురాలిగా ఉన్న షీలా దీక్షిత్ రెండేళ్ల క్రితం కన్నుమూయడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు సరైన నాయకుడు ఇప్పటి దొరకట్లేదు. ఎన్నికల ప్రచార సమయంలో పెద్దస్థాయి లీడర్లంతా వచ్చి ప్రచారం చేసి వెళ్లినా ప్రజల్లో బలమైన ఆత్మవిశ్వాసం నింపడంలో విఫలం అయ్యారు. దీంతో జనలంతా మళ్లీ ఆప్, కమలం పార్టీల వైపే మొగ్గుచూపారు. కేజ్రీవాల్ ఛరిష్మా, పథకాలు బాగా ప్రజల్లోకి వెళ్లటంతోపాటు, పీకే వ్యూహాలతో ఆప్‌కు బాగా కలిసివచ్చింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ బలహీనత బీజేపీ పుంచుకునేందుకు దోహదపడింది. అటు మోడీ, అమిత్ షా ప్రణాళికలు కొద్దిగా పనిచేయడంతో కొంతమేరకు ప్రభావం చూపగలిగి 10కి పైగా సీట్లు సంపాదించుకోగలిగారు.
దేశవ్యాప్తంగా రెండు మూడు రాష్ట్రాల్లో తప్ప అన్నిచోట్ల అధికారం, అభ్యర్థుల గెలుపును అందని ద్రాక్షలా ఫీలవుతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఢిల్లీలో ఒక్క సీటు కూడా సాధించుకోకపోవడం ఆ పార్టీ అధినేతలకు మింగుడు పడట్లేదు. ఆప్, బీజేపీ అంతకాకున్నా కనీసం 5సీట్లు గెలిచైనా ఉనికిని నిలుపుకోవాలనుకున్న హస్తం పార్టీకి హస్తీనా ప్రజలు హ్యాండ్ ఇవ్వడంతో జాతీయ పార్టీకి పెద్ద బ్యాండ్ పడినట్లు అయ్యింది. కాంగ్రెస్ జాతీయ నాయకత్వంతోపాటు రాష్ట్ర నాయకత్వంపై కూడా నేతలు సరైన నమ్మకాన్ని కల్పించడంలో విఫలం కావడంతో ఆప్‌కు విజయాలు దక్కి, కాషాయానికి కలిసొచ్చినట్లు అవుతోంది. ఈసారి ఫలితాలను దృష్టిలో పెట్టుకోనైనా భవిష్యత్‌లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లి ఢిల్లీలోతోపాటు దేశవ్యాప్తంగా బలపడేందుకు ఏవిధమైన వ్యూహాలతో ముందుకెళ్తారన్నది ముందు ముందు చూడాల్సిన అంశం.