‘కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తి లేదు’

by Aamani |
ex mlc prem sagar rao
X

దిశ, మంచిర్యాల: తాను పార్టీ మారుతున్నట్లు చేస్తున్న ప్రచారం అవాస్తవమని, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని ఏఐసిసి సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్లు చేస్తున్న ప్రచారంలో అవాస్తవమని తేల్చిచెప్పారు. అధిష్టానం నిర్ణయం మేరకు నూతన టిపిసిసి నాయకత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని ఆయన వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, గెలుపు కోసం పని చేస్తామని ఆయన తెలిపారు.

టీపీసీసీ అధ్యకుడి నియామకంలో ఉత్తర తెలంగాణ నుండి సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు ను నియమించాలని అధిష్టానాన్ని కోరామన్నారు. అధిష్టానం నిర్ణయం మేరకు నూతన టీపీసీసీ నాయకత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని ఆయన వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలకు తావు లేదని ఆయన ప్రకటించారు. రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed