పోలీసులు పద్ధతి మార్చుకోవాలి.. వంశీకృష్ణ వార్నింగ్

by Shyam |   ( Updated:2021-08-06 04:48:05.0  )
DCC-President-Dr.-Vamsi-Kri
X

దిశ, అచ్చంపేట: రైతులపై పోలీసుల దాడిని నిరసిస్తూ నాగర్ కర్నూలు జిల్లా పొంగూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ… అకారణంగా రైతును పోలీసులు కొట్టడం దుర్మార్గమైన చర్య అని ఆయన ఖండించారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతూ, ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులు పెట్టడం తగదని అన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ విధానంలో మార్పు రావాలని ఆయన తెలిపారు. జిల్లాలో ఇసుక మాఫియాను పోలీసులే పెంచి పోషిస్తున్నారని విమర్శించారు.

ఈ విషయంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లగా.. ఆ డ్యూటీ మాది కాదని చెప్పిన ఎస్పీ, నేడు ఎందుకు పోలీసులు వాహనాలను పట్టుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన అనుచరులుగా ఉన్న పార్టీ నాయకులకు రెవెన్యూ అధికారులు ఇసుక తరలించేందుకు అనుమతి ఇస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు సొంత ఇంటి నిర్మాణం కోసం ఇసుక అనుమతి కోసం వెళితే కొర్రీలు పెడుతూ అనుమతులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అండదండలతో ఇసుక మాఫియా జోరుగా కొనసాగుతుందని ఆరోపించారు.

అధికారులు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సి ఉంది పోయి అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. రైతును అకారణంగా కొట్టిన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అలాగే పోలీసు శాఖలో మార్పు రావాలని ఆయన తెలిపారు. పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ కేవీఎన్ రెడ్డి, అమ్రాబాద్ మండల ఎంపీపీ శ్రీనివాసులు, మండల పార్టీ అధ్యక్షులు పండిత రావు, ఎంపీటీసీ, సర్పంచ్, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed