కరోనా నివారణలో ప్రభుత్వం విఫలం

by Shyam |
కరోనా నివారణలో ప్రభుత్వం విఫలం
X

దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్‌-19ను ఎదుర్కోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి విమర్శించారు. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు, సూచనలు చెప్పడానికి కనీసం ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 18న కాంగ్రెస్ పక్షాన ఆన్‌లైన్ ఉద్యమం చేపడుతున్నామని తెలిపారు. అన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తామన్నారు.

Advertisement

Next Story