- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వలస కూలీల కోసం దేశవ్యాప్త యాక్షన్ ప్లాన్ వేయాలి’
న్యూఢిల్లీ: వలస కూలీలకు ఉపకరించేలా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక యాక్షన్ ప్లాన్ వేయాలని సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ వాదించింది. వారి సమస్యలను సుప్రీంకోర్టు సుమోటోగా విచారించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన తర్వాతి రోజు కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వలస కూలీలకు సంబంధించిన ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు అనుమతినివ్వాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలు చేశారు. లాక్‌డౌన్ కారణంగా వేరే రాష్ట్రాల్లో చిక్కుకున్న శ్రామికుల సమస్యను చర్చించి చర్యలు తీసుకునేందుకు విపక్షాలతో కలిసి జాయింట్ కమిటీ ఏర్పాటు చేయడంలో కేంద్రం విఫలమైందని పేర్కొన్నారు. పార్లమెంట్ మూసే ఉండటంతో ప్రతిపక్షాలు ఈ సమస్యను లేవనెత్తలేకున్నాయని తెలిపారు. వలస కార్మికుల సమస్యలపై తమ వద్ద ఉన్న కొన్ని చర్యలను కోర్టుకు తెలియజేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక యాక్షన్ ప్లాన్ వేయాలని, జిల్లాలు గ్రామాల వారీగా ఎన్యుమరేటర్లను తీసుకుని వలస కూలీల వివరాలను, వారి సంఖ్యను సేకరించాలని సూచించారు. అలాగే, ప్రతి జిల్లాలో వలస కూలీలను రిసీవ్ చేసుకునే, ఇతర సదుపాయాలు కల్పించే సెంటర్‌లను ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామస్థాయిలో వారు తాత్కాలికంగా విశ్రాంతి తీసుకునే సెంటర్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్యుమరేటర్ల ద్వారా శ్రామికుల వివరాలు తీసుకున్నాక, వారికి ఉపాధి, ఆహారం, ఆశ్రయం, వైద్య సదుపాయాలను కల్పించాలని పిటిషన్‌లో రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు.