- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మోడీ పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్.. కేసీఆర్ శ్రీలంక ఫాస్ట్ బౌలర్’
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్‌లు మాటల మాంత్రికులు తప్పా చేతలు లేవని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ విమర్శించారు. మోడీ పాకిస్తాన్ పాస్ట్ బౌలర్ లాంటి వాడైతే.. కేసీఆర్ శ్రీలంక బౌలర్ మలింగ లాంటి వాడని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాములు నాయక్ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల ముందు దేశాన్ని 2020లో ప్రపంచంలో అగ్రగామిగా నిలుపుతానన్నా మోడీ.. కరోనా వైరస్ వ్యాప్తిలో అగ్రగామిగా నిలిపారన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా పెద్ద ఎత్తున్న విస్తరించే ఆవకాశం ఉందని హెచ్చరిస్తున్నప్పటికీ మోడీ నమస్తే ట్రంప్ కార్యక్రమం పెట్టారని విమర్శించారు. చైనా కంటే భారత్‌లో కేసులు ఎక్కుగా వచ్చాయని తెలిపారు. నమస్తే ట్రంప్ కార్యక్రమంలో విదేశీ విమానాలు రాకుంటే కరోనా కేసుల సంఖ్య ఇంతగా ఉండేది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ధనికుల ద్వారా వచ్చిన వైరస్ పేదలకు అంటిచారన్నారు. సీఎం కేసీఆర్ ప్రధానితో పోటిపడి లాక్‌డౌన్ రోజులు పెంచాడన్నారు. మోడీ కంటే తెలివైన వాడినని ప్రధానిని అయితానని కేసీఆర్ పగటికలలు కంటున్నాడని రాములు నాయక్ ఎద్దేవా చేశారు.