- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీలో అనుచిత ఘటన.. గవర్నర్‌ను నెట్టేసిన ఎమ్మెల్యేలు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ముందు శుక్రవారం హైడ్రామా జరిగింది. అసెంబ్లీలో ప్రసంగాన్ని అర్ధంతరంగా ముగించి బయటకు వెళ్తున్న గవర్నర్ బండారు దత్తాత్రేయను ప్రతిపక్ష నేతలు అడ్డుకున్నారు. అధికార, ప్రతిపక్ష నేతలూ గుమిగూడటంతో చిన్నపాటి తోపులాట చోటుచేసుకుంది. ఇందులోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్ దత్తాత్రేయను నెట్టేసినట్టు అధికారపక్షం ఆరోపించింది. కాగా, బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలే తమను తోసేసినట్ట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అనంతరం అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చర్చల నుంచి సస్పెండ్ చేయాలని అధికారపక్షం ప్రవేశపెట్టిన తీర్మానానికి స్పీకర్ విపిన్ పర్మార్ ఆమోదించారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగిస్తుండగానే గవర్నర్ అన్నీ అబద్ధాలే చెబుతున్నారని, తాము లేవనెత్తిన పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరల పెరుగుదలను పేర్కొనలేదని కాంగ్రెస్ నేతలు నిరసన తెలియజేశారు. ప్రతిపక్ష నేత ముఖేశ్ అగ్నిహోత్రి సారథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాదాలతో నిరసనలకు దిగారు. సభలో గందరగోళం రేగడంతో గవర్నర్ దత్తాత్రేయ తన ప్రసంగంలోని చివరి రెండు వాక్యాలు చదివి ఉపన్యాసం ముగిసినట్టుగా గుర్తించాలని నిష్క్రమించారు. గవర్నర్ దత్తాత్రేయ మంత్రులతో కలిసి బయటకు వస్తుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన వెళ్లే దారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే అధికార, విపక్ష ఎమ్మెల్యేలకు మధ్యవాగ్వాదం జరిగింది. ఇక్కడే గవర్నర్ దత్తాత్రేయను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తోసేసినట్టు సమాచారం. ఈ గందరగోళంతో సోమవారం మధ్యాహ్నానికి అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభ్యంతరకర ప్రవర్తన దృష్ట్యా వారిని చర్చల నుంచి సస్పెండ్ చేయాలని మళ్లీ నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర మంత్రి సురేశ్ భరద్వాజ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మార్చి 20 నాడు ముగియనున్న ఈ సెషన్‌లో పాల్గొనకుండా ప్రతిపక్ష నేత ముఖేశ్ అగ్నిహోత్రి, మరో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హర్షవర్దన్ చౌహాన్, సుందర్ సింగ్ ఠాకూర్, సత్పాల్ రాయిజాదా, వినయ్ కుమార్‌లను సస్పెండ్ చేసినట్టు స్పీకర్ విపిన్ పర్మార్ స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానులేనని, అందుకే వారిపై చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై సీఎం జైరామ్ ఠాకూర్ మండిపడ్డారు. గవర్నర్ సహాయకులపై ప్రతిపక్ష నేత దాడికి దిగారని, ప్రతిపక్ష నేతల ప్రవర్తన అభ్యంతరకరమని ఖండించారు.
గవర్నర్‌ను తాకనేలేదు: కాంగ్రెస్
గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే ఉన్నాయని, కరోనా మేనేజ్‌మెంట్‌లో అవినీతి, నిరుద్యోగం, అధిక ధరల గురించి ప్రస్తావించనలేదని ప్రతిపక్ష నేత ముఖేశ్ అగ్నిహోత్రి తెలిపారు. దాదాపు ఏడాది తర్వాత ప్రారంభమైన ఈ సమావేశంలో ఆయన అబద్ధాలైనా సరే తన ప్రసంగాన్ని మొత్తం చదివి వినిపించాల్సిందని అన్నారు. తాము నినాదాలిస్తుండగా బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులూ తమను నెట్టేశారని ఆరోపించారు. తాము గవర్నర్‌తో మాట్లాడాలనుకున్నామని, కానీ, మమ్మల్ని అక్కడి నుంచి లాగేశారని అన్నారు.