- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీలో చొక్కా విప్పిన నేత.. ఏం జరిగిందంటే
బెంగళూరు: జమిలీ ఎన్నికల అంశాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కర్ణాటక అసెంబ్లీలో వినూత్న నిరసన చేశారు. అసెంబ్లీలోనే చొక్కా విప్పి ఆందోళన చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని బీజేపీ గురువారం చర్చకు తీసుకువచ్చింది. ఈ చర్చను ప్రారంభించగానే వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే సంగమేశ్ తన చొక్కాను విప్పి నిరసించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చర్యపై అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్దే కగేరి ఆగ్రహించారు. వెంటనే ఎమ్మెల్యే సంగమేశ్‌ను సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో నెలకొన్న గందరగోళం దృష్ట్యా సభను వాయిదా వేశారు. ఒకదేశం ఒక ఎన్నిక అనేది ఆర్ఎస్ఎస్ లక్ష్యమని, ఆ ప్రతిపాదనతో తాము ఏకీభవించబోమని కర్ణాటక మాజీ సీఎం సిద్దారామయ్య స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఈ విధానానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారని అన్నారు. అసెంబ్లీ స్పీకర్ జమిలి ఎన్నికల అంశాన్ని ప్రస్తావించడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, ఒకే దేశం, ఒకే ఎన్నికల విధానాన్ని తాము వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ వివరించారు. రాజకీయ లబ్ది కోసమే ఈ అంశంపై బీజేపీ చర్చను పెట్టాలని భావిస్తున్నదని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్లమెంటు ఎన్నికలతోపాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలనూ నిర్వహించాలని, తద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలగదని బీజేపీ నేతలు వాదిస్తున్నారు.