- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టం.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో : రాజకీయ లబ్ధి కోసమే సీఎం కేసీఆర్ హామీలు ఇస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో 10% హామీలు కూడా నెరవేర్చలేకపోయారన్నారు. శనివారం వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేటలో నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాలో మాట్లాడారు.
హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దళితబంధు పథకం తీసుకొచ్చారన్నారు. ఈ పథకాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితులతో పాటు గిరిజనులకు రూ. 10 లక్షలు ఇవ్వాలన్నారు. మైనారిటీ, బీసీ ఇతర కులాల పేద వారికి కూడా ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ప్రతీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై భవిష్యత్తులో పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తామన్నారు. వర్ధన్నపేట సెగ్మెంట్‌లో ఉన్న దళితులందరికీ రూ. 10 లక్షలు ఇస్తే కాంగ్రెస్ అభ్యర్థిని పోటీలోకి దింపమని జగ్గారెడ్డి వెల్లడించారు.