Revanth Reddy :మాట నిలబెట్టుకున్న రేవంత్.. సీఎం కేసీఆర్‌కు భారీ షాక్

by Anukaran |   ( Updated:2021-09-04 07:18:15.0  )
Revanth Reddy :మాట నిలబెట్టుకున్న రేవంత్.. సీఎం కేసీఆర్‌కు భారీ షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో కాంగ్రెస్ తన పట్టును నిలబెట్టుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఊపు తెచ్చారు. 2024 ఎన్నికలే టార్గెట్‌గా ప్రణాళికలు రచిస్తున్నారు.

అయితే, ఇది వరకే టీ కాంగ్రెస్ దళిత, గిరిజన దండోరా సభలను రావిర్యాలలో, మూడు చింతలపల్లిలో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సత్తా ఏంటో చూపేందుకు సెప్టెంబర్‌ 17న సభ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు టీ కాంగ్రెస్ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed