- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
22న కాంగ్రెస్ మహా ధర్నా
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 22న మహాధర్నా నిర్వహిస్తున్నామని, ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ప్రధానకార్యదర్శి వర్కర వేణుగోపాల్ రావు కోరారు. గాంధీ భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడి పోరాటాలు నిర్వహించి మెడలు వంచి ప్రజలకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. 19 రాజకీయ పక్షాలు సోనియా గాంధీ నేతృత్వంలో తీసుకున్న పోరాటాల ప్రణాళిక ప్రకారం బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల పనితీరుపై పోరాటం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై ఈనెల 22న మహాధర్నా, 27న భారత్ బంద్, 30న జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 5న పోడు భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులకు పట్టాలివ్వాలని రాస్తారోకో చేయడం జరుగుతుందన్నారు. అటవీ హక్కుల చట్టం, పోడు రైతుల సమస్యల పరిష్కారం అంశాలపై పోరాటం చేయనున్నామని, ఆదిలాబాద్ నుంచి అశ్వరావుపేట వరకు నిర్వహించే పోడు రాస్తారోకోలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.