- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. రాజీనామా చేయాలని..!
దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు నిరసన సెగ తగిలింది. రామారెడ్డికి వచ్చిన ఎమ్మెల్యే కాన్వాయ్‌ను కాంగ్రెస్ నాయకులు అడ్డగించారు. ఎమ్మెల్యే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేస్తే హుజురాబాద్ తరహాలో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి కూడా దళితబంధు వస్తుందని, పింఛన్లు వస్తాయని నినాదాలు చేశారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జడ్పీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడి ఉందన్నారు.
ఈటల రాజేందర్ మాదిరిగా స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ రాజీనామా చేస్తే హుజురాబాద్‌కు వచ్చినట్టుగా అందరికీ దళితబంధు వస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలు ఆఘమేఘాల మీద వస్తాయని, వృద్ధులకు పింఛన్లు వస్తాయన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే ఓటేసి గెలిపించిన ప్రజల బాగుకోసం తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రాజీనామా చేసేవరకు ఆయన ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్లినా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. అరెస్టైన వారిలో జడ్పీటీసీ మోహన్ రెడ్డి, పోసానిపేట సర్పంచ్ మహేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు చింతకింది కిషన్, గ్రామ అధ్యక్షులు నర్సింలు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజు, ఇసన్నపల్లి యూత్ అధ్యక్షులు రవీందర్, శంకర్, మద్దికుంట గ్రామ యూత్ అధ్యక్షులు రఘుపతి రెడ్డి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు సేవ్యా నాయక్ తదితరులు ఉన్నారు.