- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శిథిలావస్థకు చేరిన బ్రిడ్జి.. పట్టించుకోని ఎమ్మెల్యే
దిశ, హుస్నాబాద్: బ్రిడ్జి శిథిలావస్థకు చేరినా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామం సమీపంలోని మోయుతుమ్మెద వాగుపై నిర్మించిన బ్రిడ్జిపై శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శులు చిత్తారి రవీందర్, మంద ధర్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
గత రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలకు మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహించడంతో 70 ఏళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి పూర్తిగా ధ్వంసమైందన్నారు. ఆగస్టు 15వ తేదీన నీటి ప్రవాహానికి లారీతో సహా డ్రైవర్ గల్లంతై ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రాన్ని కలిచి వేసిందన్నారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో మోయతుమ్మెద వాగు, పిల్లి వాగు, రేణుక ఎల్లమ్మ, ఇందుర్తి వాగులపై నిర్మించిన బ్రిడ్జిలు ఎత్తు తక్కువ ఉండడంతో నీటి ప్రవాహం బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తుందన్నారు. ఆ ప్రవాహానికి రాత్రుళ్లు పలు గ్రామాల ప్రజలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని మంత్రి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు స్పందించి పలు వాగులపై నూతన బ్రిడ్జిలను నిర్మించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.