- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ vs కాంగ్రెస్ చూసుకుందామా..? కాంగ్రెస్ నేత సవాల్
దిశ, మణుగూరు: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిపై కొంతమంది టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడాన్ని పినపాక కాంగ్రెస్ నేతలు ఖండించారు. మంగళవారం మణుగూరు పట్టణ అధ్యక్షుడు పిరనాకి నవీన్ మండల అధ్యక్షుడు రషీద్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బిడ్డా కేసీఆర్.. రేవంత్ రెడ్డి ఇంటిపై దాడి చేస్తారా? టీఆర్ఎస్ పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా చూసుకుందామా?’’ అని సంచలన సవాల్ విసిరారు. టీఆర్ఎస్ పార్టీ చేసే దందాలు, అక్రమాల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇండ్లపై దాడి చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలు తలచుకుంటే టీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కరు కూడా మిగలరని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
టీఆర్ఎస్ గుండాగిరికి, దౌర్జనానికి భయపడేది లేదని తెలిపారు. మరోసారి టీఆర్ఎస్ నేతలు ఇలాంటి దాడులకు పాల్పడితే కాంగ్రెస్ కార్యకర్తలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ‘దళితబంధు’ పేరుతో మరోసారి దళితులను మోసం చేయడానికి ప్రయత్నిస్తోన్న కేసీఆర్ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధిచెబుతారని సూచించారు. ఈ సమావేశంలో మైనార్టీ సెల్ నాయకులు షరీఫ్, బీసీ సెల్ నాయకులు కొడెం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.