- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేశాం.. కాంగ్రెస్
దిశ, తెలంగాణ బ్యూరో: రైతుల అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ నాటకాలు చేస్తున్నాయని, ముందు ఈ ప్రభుత్వాలను కట్టడి చేయాలని కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. బుధవారం గవర్నర్ తమిళ సై సౌందరరాజన్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్ ఎదుట మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతు సమస్యలను గవర్నర్‌కు విన్నవించామని, గవర్నర్ తమిళిసైతో భేటీ అయి సమస్యను వివరించినట్లు కాంగ్రెస్ నేతలు వివరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును కాంగ్రెస్ ఆధ్యర్యంలో నిరసనలతో, దీక్షలతో ప్రశ్నిస్తూనే ఉన్నామని, అయినా ఇప్పటివరకు స్పందించలేదన్నారు. కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులను కలవాలని గవర్నర్‌ను కోరామన్నారు. ఇప్పటికే 70% ధాన్యం మిల్లర్లకు వెళ్ళిపోయిందని, పదమూడు, పద్నాలుగు వందల రూపాయలకు మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేశారన్నారు. తడిసిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా గతంలో కాంగ్రెస్ కొనుగోలు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు నష్టం జరగకుండా మినిమం సపోర్ట్ ధరలతో కొన్నామని పేర్కొన్నారు.
గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, రాష్ట్ర చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఎల్పీ మాజీ నేత షబ్బీర్ అలీ తదితరులు ఉన్నారు.