- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బతికున్నప్పుడు విమర్శించి ఇప్పుడు పీవీ ఫొటో వాడుకుంటారా?
దిశ, వెబ్‌డెస్క్: మాజీ ప్రధాని పీవీ నరసింహాాాారావు ఫొటోలను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ వాడుకోవడంపై తెలంగాణలో వివాదం చెలరేగుతోంది. తమ నేత అయిన పీవీ ఫొటోలను టీఆర్‌ఎస్ ఎలా వాడుకుంటుందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసమే కేసీఆర్ ఎంతటికైనా దిగజారుతారని విమర్శిస్తున్నారు.
ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ ఫొటోలను టీఆర్‌ఎస్ వాడుకోవడంపై ఎన్నికల కమిషన్‌కి కాంగ్రెస్ నేతలు తాజాగా ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన కాంగ్రెస్ నేతల బృందం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పీవీ ఫోటోలను వాడుకోవడంపై ఫిర్యాదు చేశారు. పీవీ బతికున్నప్పుడు ఆరోపణలు చేసి ఇప్పుడు ఆయన ఫోటోలు ఎలా వాడుకుంటున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ నరసింహారావు కూతురు వాణిదేవికి టీఆర్‌ఎస్ సీటు కేటాయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఎన్నికల ప్రచారంలో పీవీ ఫొటోలను టీఆర్‌ఎస్ వాడుకోవడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.