- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్‌కు షాక్.. చెట్ల పొదల నుంచి మంత్రుల కాన్వాయ్‌పై ఎటాక్
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పర్యటనలో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. నందిగామ మండలం మేకగూడ వద్ద ఓ కంపెనీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొనడానికి వస్తున్నారు. అయితే నియోజకవర్గానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు పురుషోత్తం రెడ్డి, అందే మోహన్, మహిపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో కేటీఆర్ కాన్వాయ్‌ను కార్యకర్తలు అడ్డుకున్నారు. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
మేక గూడా కొత్తూరు మధ్యలో కేటీఆర్ కాన్వాయ్ వస్తుండగా చెట్ల పొదల్లో నుండి అకస్మాత్తుగా వచ్చిన కార్యకర్తలు కాన్వాయ్‌కు ఎదురుగా పరుగులు తీశారు. జై కాంగ్రెస్ అంటూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వెంటనే తేరుకొని ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. కొంతమంది పై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగ భృతి చెల్లించాలని, ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల లాఠీలకు, కేసులకు భయపడమని పురుషోత్తం రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ దామనకాండ నడుస్తోందని ఆయన విమర్శించారు.