- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పవన్ కల్యాణ్‌ది గొప్ప నిర్ణయం.. హర్షించిన కాంగ్రెస్ నేత వీహెచ్
దిశ, తెలంగాణ బ్యూరో: దామోదరం సంజీవయ్య అత్యంత నిజాయితీ పరుడని మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దామోదరం సంజీవయ్య జయంతి, వర్ధంతిలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు తప్పకుండా పాల్గొనాలన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో పేదలకు ఎంతో మేలు చేశారన్నారు. ఆయనను గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. అయితే, సంజీవయ్య మీద అభిమానంతో కర్నూల్‌లో ఉన్న ఇంటిని అభివృద్ధి చేయడానికి పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు ఇవ్వడాన్ని హర్షిస్తున్నానని తెలిపారు. పవన్‌ను అభినందిస్తూ లేఖను కూడా రాశానని చెప్పారు.
కేంద్ర మొండి వైఖరిని ఖండిస్తున్నా..
విశాఖ స్టీల్ ప్రైవేటు పరం కాకుండా ఉండాలంటే జగన్ ఎన్డీఏలో కలవాలని కేంద్ర మంత్రి రాం దాస్ అతవలె బెదిరించడం శోచనీయమన్నారు. దీనిని కాంగ్రెస్‌పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ, అనుబంధ సంస్థలను ప్రైవేటీకరించడం వల్ల రిజర్వేషన్లు పోతాయన్నారు. కేంద్రం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై కాంగ్రెస్‌పార్టీ పోరాటం చేస్తుందన్నారు.