ఏపీలో రోజుకో హత్య.. పూటకో అత్యాచారం: సుంకర పద్మశ్రీ

by srinivas |
ఏపీలో రోజుకో హత్య.. పూటకో అత్యాచారం: సుంకర పద్మశ్రీ
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో మహిళలపై రోజుకో హత్య.. పూటకో అత్యాచారం జరుగుతున్నాయని మహిళా కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో అత్యాచార నిరోధక పోరాట వేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. మహిళా సంఘాలు, పౌరసంఘాలు నిరాహార దీక్షలో పాల్గొన్నాయి. ఈ ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ జగన్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో మహిళలపై రోజుకో హత్య.. పూటకో అత్యాచారం జరుగుతున్నాయని ఆరోపించారు. మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన ఈ ప్రభుత్వం.. అమలులోలేని దిశ చట్టం గురించి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని విరుచుకుపడ్డారు. మహిళలపై దాడులు జరుగుతుంటే వాటిని అరికట్టేందుకు ప్రయత్నించకుండా ప్రభుత్వం వెనకాడుతోందని మండిపడ్డారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటుందని.. అది సరికాదని హితవు పలికారు. పాదయాత్రలో సీఎం జగన్ ముద్దులు పెట్టి… చివరకు రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి మహిళల భద్రతకు పెద్దపీట వేయాలని.. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో బాధితులతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని సుంకర పద్మశ్రీ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed