‘చర్యలు తీసుకుంటారా.. మూసేస్తారా’?

by Sridhar Babu |
‘చర్యలు తీసుకుంటారా.. మూసేస్తారా’?
X

దిశ, కరీంనగర్: రెడ్‌జోన్‌గా ఉన్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి తరలిస్తున్న ఇసుక రవాణా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన శ్రీధర్ బాబు ఇసుక క్వారీల నిర్వహణ తీరును తప్పు పట్టారు. రెడ్‌జోన్‌లో ఉన్న హైదరాబాద్ నుంచి ఇసుక రవాణా చేసేందుకు వస్తున్న లారీల డ్రైవర్లు, క్లీనర్లు స్వీయ రక్షణ చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీంతో మంథని నియోజకవర్గంలో ఇసుక క్వారీలు నడుస్తున్న ప్రాంతాల్లో కరోనా వ్యాధి ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక తరలిస్తున్న లారీ డ్రైవర్లు, క్లీనర్లు రక్షణ చర్యలు తీసుకునేందుకు చొరవ తీసుకోవాలని శ్రీధర్ బాబు కోరారు. లేనట్టయితే 15 క్వారీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం సేకరించదల్సిన 25 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక రవాణాను నిలిపివేయాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed